HYD: ఆధార్ కార్డులో ఏవైనా మార్పులు, చేర్పులు చేయించాలంటే గ్రేటర్ హైదరాబాద్లోని ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నార. ఈ నేపథ్యంలో తపాలా శాఖ ఆధార్లో మార్పులకు సంబంధించిన సేవల సమయాలను పొడిగిస్తున్నట్లు హైదరాబాద్ GPO చీఫ్ పోస్ట్ మాస్టర్ ప్రసాద్ తెలిపారు. ఇకపై ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు.