AP: రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇవాళ తూర్పు మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడవచ్చని.. తర్వాత 24 గంటల్లో అది పశ్చిమ, వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని తెలిపింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో నాలుగు రోజులు వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించింది.