GNTR: కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల (CHO) సమస్యలను పరిష్కరించాలని ఏపీఎంసీఏ రాష్ట్ర అధ్యక్షుడు నిరంజన్ డిమాండ్ చేశారు. CHO ప్రతినిధులు వెలగపూడి సచివాలయంలో మంత్రి సత్యకుమార్ యాదవ్, ప్రిన్సిపల్ సెక్రటరీ సౌరబ్ కుమార్లను కలిసి వేతన సవరణ, సమ్మె కాలపు జీతాలు, ఈపీఎఫ్వో సమస్యలపై విజ్ఞప్తి చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.