ప్రకాశం: వెలిగండ్లలో వర్షానికి తలచిన సజ్జ పంటను స్థానిక సర్పంచ్ తాతపూడి సురేష్ బాబు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అల్పపీడన ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు వెలిగండ్ల మండల వ్యాప్తంగా సజ్జ పంట వర్షపు నీటిలో తడిసి దెబ్బతినే పరిస్థితి ఏర్పడిందన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు పంటలు పరిశీలించి, రైతులకు నష్టపరిహారం అందాల చూడాలన్నారు.