NLG: రైతుల సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. శుక్రవారం నార్కెట్ పల్లి మండలం చౌడంపల్లిలోని వరలక్ష్మి కాటన్ మిల్లులో సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.