CTR: పలమనేరు బలిజ అభ్యుదయ సేవా సంఘం కార్యాలయ భవనాన్ని పలమనేరు MLA అమర్నాథ్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ మేరకు బాస్ సభ్యుల ఆధ్వర్యంలో స్థానిక గంగమ్మ గుడి షాపింగ్ కాంప్లెక్స్ నందు ఏర్పాటు చేసిన ఈ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బాస్ సంఘ నాయకులు సుధాకర్ , రూపేష్, కిరణ్, అరుణ్, జనార్దన్,నరసింహులు, పిజేసి బాబు పాల్గొన్నారు.