W.G: భీమవరం మండలం కొత్త పూసలమర్రు గ్రామం వద్ద దొంగపిండి కాలువ పూడిక తీత పనులను ఇవాళ టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి ప్రారంభించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పంట నీరు, మురుగునీరు కాలువల పూడిక తీత పనులను చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. రైతులు స్వచ్ఛందంగా పూడిక తీత పనులను నిర్వహిస్తూ ప్రక్షాళన చేయడం సంతోషకరమన్నారు.