CTR: చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ వారి కార్యాలయంలో శుక్రవారం “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (పీజీ ఆర్ఎస్) కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. శుక్రవారం నాటి కార్యక్రమంలో మొత్తం 12 వినతులు అందాయి. కాగా, కార్యక్రమంలో హౌసింగ్ డీఈ శ్రీధర్, మున్సిపల్ డీఈ వెంకట రమణ, తెదేపా నాయకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.