WGL: నర్సంపేట పట్టణంలోని సిటిజన్ క్లబ్లో అక్టోబర్ 27న పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి ఈ శిబిరం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. రక్తదానం ప్రాణ రక్షణకు మహత్తర సేవ అని, యువతీ యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేయాలని పోలీసులు కోరారు.