MBNR: పాలమూరు యూనివర్సిటీలో నిర్మాణంలో ఉన్న రీసెర్చ్ బిల్డింగ్ పనులను యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య జిఎన్.శ్రీనివాస్ ఇవాళ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్మాణం నాణ్యతగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఈ రీసెర్చ్ బిల్డింగ్ విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్ బాబు పాల్గొన్నారు.