VZM: సమన్యాయం పొందడం అందరికీ మన రాజ్యాంగం కల్పించిన హక్కు అని జిల్లా న్యాయమూర్తి బబిత అన్నారు. పేదరికం లేదా ఇతరత్రా కారణాలవల్ల ఏ ఒక్కరూ కూడా న్యాయం పొందకుండా ఉండలేరని ఆమె స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీలు, నిరుపేదలు, మహిళలు, వృద్ధులు, వికలాంగులు తదితర వర్గాలకు చెందిన వారికి ఉచిత న్యాయ సహాయం లేదా సలహాలు పొందే అవకాశం న్యయసేవాధికారి సంస్థ అందిస్తోందన్నారు.