KRNL: నందవరం మండల పరిధిలోని సోమల గూడూరు, నాగులదిన్నె సచివాలయాలను, అంగన్వాడీ సెంటర్లను మండల పరిషత్ అభివృద్ధి శాఖ అధికారి పుల్లయ్య తనిఖీ చేశారు. అటెండెన్స్ మూమెంట్ రిజిస్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో పుల్లయ్య మాట్లాడుతూ.. సచివాలయ ఉద్యోగులు తప్పనిసరిగా సమయపాలన పాటించాలని అన్నారు. అలాగే ఇచ్చిన బాధ్యతలను తప్పనిసరి నిర్వర్తించాలన్నారు.