మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర శాసనసభ్యులు జి. మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు జీ.కే. ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డప్పుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్టు ఫౌండేషన్ ఛైర్మన్ రాజశేఖర్ తెలిపారు. గ్రామానికి చెందిన హరిజన్ ముక్కిడి బాలప్ప, ముక్కిడి లక్ష్మయ్య బోడి కథలయ్యలకు డప్పులు అందించామన్నారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ.. గ్రామీణ కళాకారులకు అండగా ఉంటామన్నారు.