VSP: విశాఖ నగర పోలీస్ కమీషనర్, హోంగార్డు నుంచి సీఐ స్థాయి వరకు సిబ్బంది విధులకు తగిన గుర్తింపు ఇస్తూ.. ప్రతి నెలా ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి రివార్డులు అందిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం 69 పోలీసులకు సీపీ శంఖబ్రత బాగ్చి అవార్డులు, రివార్డులను అందజేశారు. వివిధ కేసుల్లో ప్రతిభ కనబరిచిన సిబ్బందికి అవార్డులను అందజేసి ప్రోత్సహించారు.