JGL:నూతనంగా ఎన్నికైన కార్యవర్గం శ్రీ రాజరాజేశ్వర నాగాలయం అభివృద్ధికి కృషి చేయాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. రాయికల్ మండలం కొత్తపేటలోని నాగాలయం ట్రస్ట్ సభ్యుల ప్రమాణ స్వీకారం శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే, సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించి, అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.