MLG: ఏటూరునాగారం మండలంలోని దొడ్ల గ్రామంలో జంపన్నవాగు ఉద్ధృతి కొనసాగుతోంది. దీంతో ముంపు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శనివారం ఉచిత కంటి శిబిరానికి వెళ్లేందుకు 80 ఏళ్ల వృద్ధురాలు నడుములోతు నీటిలో వాగును యువకుల సహాయంతో దాటింది. అధికారులు వెంటనే స్పందించి, బోటింగ్ సౌకర్యం ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.