ASR: ప్రభుత్వ కాలేజీలు అన్నీ పూర్తిగా ప్రభుత్వ అధీనంలోనే నడవాలని అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం కోరారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా శనివారం పెదబయలు మండలం గుండాలగరువు గ్రామంలో నిర్వహించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. గతంలో జగన్ 17 మెడికల్ కాలేజీలు తీసుకువచ్చారన్నారు. అయితే కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటు పరం చేసిందని తెలిపారు.