SKLM: ఆమదాలవలస TSR డిగ్రీ కళాశాలలో ఈనెల 30వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల కరస్పాండెంట్, సెక్రటరీ T.V.S చిరంజీవి నాగ్, ప్రిన్సిపాల్ కూన భాస్కరరావు శనివారం తెలిపారు. SSC, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ,డిప్లొమా, బీటెక్ పూర్తి చేసిన 18నుంచి 30 సంవత్సరాల లోపు వయసు గల నిరుద్యోగులు అర్హులని పేర్కొన్నారు. 13 బహుళ జాతీయ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు.