W.G: తుపాన్ హెచ్చరికల జారీ, సముద్రంలో అలల ఉద్ధృతి పెరిగిన కారణంగా ఈ నెల 26 నుంచి 28 వరకు మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్‌లోకి సందర్శకులకు అనుమతి లేదని ఎస్సై వాసు ఇవాళ తెలిపారు. వాతావరణంలోని మార్పుల వల్ల అలలు వేగంగా వస్తుండటంతో ప్రమాదం సంభవించే అవకాశం ఉందన్నారు. కావున సందర్శకులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.