AP: కర్నూలు బస్సు ప్రమాదంపై ఇప్పటికే కేసు నమోదు చేశామని హోంమంత్రి అనిత తెలిపారు. బస్సు డ్రైవర్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడని చెప్పారు. మృతదేహాలు పూర్తిగా కాలిపోయి గుర్తు పట్టలేని స్థితిలో ఉన్నాయని పేర్కొన్నారు. DNA శాంపిల్స్ ఆధారంగా కుటుంబ సభ్యులకు మృతదేహాలు అప్పగిస్తామని స్పష్టం చేశారు. ప్రమాదం నుంచి మొత్తం 27 మంది తప్పించుకున్నారని వెల్లడించారు.