ATP: అనంతపురంలో జరిగిన ఓ వివాహ వేడుకలో జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి కలిశారు. రాజకీయాల్లో పరస్పరం విమర్శలు చేసుకుంటున్న వారు ఇద్దరూ మాట్లాడుకోవడం అక్కడి వారిని ఆకర్షించింది. ఈ సందర్భంగా వెంకటరామిరెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి కాసేపు ఆప్యాయంగా పలకరించుకున్నారు.