KMM: చింతకాని మండలం పందిళ్లపల్లి ర్యాక్ పాయింటు గురువారం 1300 టన్నుల యూరియా, 1300 టన్నుల కాంప్లెక్స్ ఎరువులు చేరుకున్నాయి. టెక్నికల్ ఏవో పవన్ కుమార్ పంపిణీ ప్రక్రియను పరిశీలించారు. ఈ ఎరువులను ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లోని మార్క్ఫెడ్, ప్రైవేటు డీలర్లకు సరఫరా చేసినట్లు అధికారులు తెలిపారు. దీంతో రైతులకు ఎరువుల కొరత తీరనుంది.