JGL: విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, ఇబ్రహీంపట్నం ఎస్సై అనిల్ సూచించారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు ఎస్సై అనిల్ ఆధ్వర్యంలో గురువారం ఇబ్రహీంపట్నం జూనియర్ కళాశాల విద్యార్థులకు సైబర్ క్రైమ్, ఉమెన్ ట్రాఫికింగ్, డ్రగ్స్ తదితర అంశాలపై జానపద పాటల రూపంలో అవగాహన కల్పించారు. కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.