CTR:సహోద్యోగిని పట్ల అసభ్యంగా ప్రవర్తించడంపై 108 అంబులెన్స్ సర్వీసులో జిల్లా మేనేజరుగా పనిచేస్తున్న మోహన్ బాబుపై టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ నెట్టి కంఠయ్య కథనం మేరకు… 108 అంబులెన్స్ సర్వీసులో పనిచేస్తున్న ఓ మహిళ పట్ల కొంతకాలంగా మోహన్ బాబు అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు లైంగికంగా వేధిస్తున్నాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.