KMM: మద్యం తాగి విధులకు హాజరైన డీఈఓ కార్యాలయ ఉద్యోగిపై సస్పెన్షన్ వేటు పడింది. ఖమ్మం కలెక్టరేట్ ఆవరణలో కొనసాగుతున్న డీఈవో కార్యాలయంలో వి.వెంకటేశ్వరరావు సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన మద్యం తాగి విధులకు రావడమే కాక ఇతరుల పనికి ఆటంకం కలిగించినట్లు తెలిసింది. ఈ విషయమై అందిన ఫిర్యాదుతో వెంకటేశ్వరరావును అధికారులు గురువారం సస్పెండ్ చేశారు.