W.G: ఆచంట మండలం కందరవల్లిలో లబ్ధిదారులకు PM విశ్వకర్మ కిట్లను కూటమి నాయకులు అందజేశారు. గతంలో PM విశ్వకర్మ పథకంలో భాగంగా గ్రామానికి చెందిన కొందరు యువకులు ఇతర ప్రాంతాల్లో శిక్షణ పొందారు. శిక్షణ పొందిన వారికి పలు పరికరాలు కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రామానికి చేరుకున్నాయి. వాటిని ఇవాళ లబ్ధిదారులకు అందించారు.