ELR: బ్యాంకు ఖాతాలు కలిగిన ప్రతి ఒక్కరు అపరిచిత వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలని వన్ టౌన్ ఎస్సై దుర్గా ప్రసాద్ తెలిపారు. ఏలూరు 1 టౌన్‌లోని ఓ ఫంక్షన్ హాల్లో ఇవాళ సైబర్ నేరాల నివారణపై బ్యాంకు ఖాతాదారులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పలు సలహాలు, సూచనలు అందించారు. తెలియని వ్యక్తులకు బ్యాంకు ఖాతాల సంబంధించిన సమాచారాన్ని షేర్ చేయవద్దన్నారు.