ASR: పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లో గురువారం ఐటీడీఏ పీవో శ్రీపూజ సుడిగాలి పర్యటన చేశారు. అరడకోట గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థుల ప్రామాణిక విద్యా సామర్థ్యాలను పరిశీలించారు. కించాయిపుట్టు అంగన్వాడీ సెంటర్ సందర్శించారు. సెంటర్ మూసివేసి ఉండడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు.