జనగామ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ప్రొఫెసర్-4, అసోసియేట్-4, అసిస్టెంట్ ప్రొఫెసర్-13, సీనియర్ రెసిడెంట్-23 పోస్టుల భర్తీకి వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నవంబర్ 5న నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ నాగమణి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన వారు దరఖాస్తులు సమర్పించి, www.gmc.jangaon వెబ్సైట్ ద్వారా ఫారంలు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.