ఉమెన్స్ వరల్డ్ కప్ మ్యాచులో న్యూజిలాండ్‌పై భారత్ 50 రన్స్ తేడాతో విజయం సాధించింది. దీంతో హర్మన్ సేన వరల్డ్ కప్ సెమీస్‌కు చేరారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 340 రన్స్ చేయగా.. వర్షం పడటంతో NZ లక్ష్యం 44 ఓవర్లకు 325గా నిర్ణయించారు. అయితే NZ 271/8 స్కోర్‌కే పరిమితమైంది. అంతకుముందు ప్రతిక(122), మంధాన(109) సెంచరీలతో రాణించారు.