PPM: మావోయిస్టుల బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో గుమ్మలక్ష్మీపురం మండలకేంద్రం ఎల్విన్ పేట పోలీస్ చెక్ పోస్ట్ వద్ద సీఐ హరి ఆధ్వర్యంలో గురువారం రాత్రి వాహన తనిఖీలు చేపట్టారు. ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రాంతం కావడంతో ప్రతి వాహనానికి సంబంధించిన పత్రాలను క్షుణ్ణంగా తనిఖీచేసి వివరాలను నమోదు చేస్తున్నామని, ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా 24 గంటలూ నిఘా ఉందన్నారు.