కొకైన్ అక్రమ రవాణాకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో తమిళ నటులు శ్రీరామ్(శ్రీకాంత్), కృష్ణలకు ED సమన్లు జారీ చేసింది. ఈ కేసులో ఈ నెల 27న శ్రీరామ్, 28న కృష్ణ విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొంది. ఇందులో భాగంగా వారి వాంగ్మూలాలను నమోదు చేయనున్నట్లు ED అధికారులు వెల్లడించారు.