MBNR: దేవరకద్ర మండలం అజిలాపూర్ గ్రామంలో ఇవాళ బొడ్రాయి, నూతన పోచమ్మ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ సంస్కృతిలో బొడ్రాయి (నాభి) పండుగను ఘనంగా జరుపుకుంటారు. అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని, ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.