KDP: ప్రొద్దుటూరుకు 1100 క్వింటాళ్ల సబ్సిడీ బుడ్డ శనగ విత్తనాలు మంజూరయ్యాయని మండల వ్యవసాయశాఖ అధికారి వరహరికుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అవసరమైన రైతులు సోమవారం నుంచి బుధవారం వరకు సబ్సిడీ విత్తనాల కోసం రైతు సేవా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. అయితే కిలో విత్తనాలకు రూ. 58.50లు రైతు వాటాగా చెల్లించాలన్నారు.