SRCL: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో 17 తేమ శాతం ఉన్న ధాన్యాన్ని ఎప్పటికప్పుడు కొనుగోలు చేయాలని ఇన్ఛార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. తంగళ్లపల్లి మండలంలోని మల్లాపూర్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఇన్ఛార్జి కలెక్టర్ శుక్రవారం తనిఖీ చేశారు. కేంద్రంలోని ధాన్యం కుప్పలను పరిశీలించారు.