ADB: ఇచ్చోడ మండలంలోని కొలాంగూడలో శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టించిన ‘పీఎం జన్మన్’ వైద్య శిభిరాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా గ్రామస్థులకు వైద్య పరీక్షలు చేసి సంబంధిత మందులను అందజేశారు. వైద్య సమస్యలు ఉంటే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులను సంప్రదించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డా.చరిత్, ఉమా, సుమతి, సాయికిరణ్, తదితరులు పాల్గొన్నారు.