కృష్ణా: నందివాడ జెడ్పీ హైస్కూల్లో విద్యార్థులకు వ్యాసరచన పోటీలను శుక్రవారం నిర్వహించారు. ప్రస్తుత కాలంలో పోలీసింగ్‌లో సాంకేతిక యొక్క పాత్ర, చిన్నారులు, మహిళలపై లైంగిక దాడుల నుంచి రక్షించుకోవడంలో విద్యార్థుల యొక్క పాత్ర గురించి విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని, తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.