కృష్ణా: గుడివాడ ధనియాల పేట పాత కాలనీలో పేకాట శిబిరంపై పోలీస్ సిబ్బందితో కలిసి వన్ టౌన్ సీఐ కొండపల్లి శ్రీనివాస్ శుక్రవారం దాడి చేశారు. పేకాట ఆడుతున్న 8 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుంచి సుమారు రూ. 2,900 నగదును స్వాధీనం చేసుకున్నారు. జూదం లేదా ఇతర అక్రమ కార్యకలాపాలు నిర్వహించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.