AP: మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లను విజయవాడ ఏసీబీ కోర్టు కొట్టివేసింది. తమకు బెయిల్ మంజూరు చేయాలని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, చాణక్య, బాలాజీ కుమార్ యాదవ్, నవీన్ కృష్ణ, వెంకటేష్ నాయుడు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ క్రమంలో వాదనలు విన్న కోర్టు వారి బెయిల్ పిటిషన్లను డిస్మిస్ చేసింది.