TPT: ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం తరఫున కార్తీక మాసం సందర్భంగా దీపోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగా ఈనెల 27న నారద పుష్కరిణిలో దీపోత్సవం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. అదే విధంగా నవంబర్ 3న వైష్ణవ కోనేరు, 10న భరద్వాజ పుష్కరిణిలో ఈ కార్యక్రమం ఉంటుందని ఆలయ ఈవో బాపిరెడ్డి తెలియజేశారు.