ప్రకాశం: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ ఈ నెల 28న కనిగిరిలో నిర్వహించ తలపెట్టిన ప్రజా ఉద్యమం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కనిగిరి వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ పిలుపునిచ్చారు. శుక్రవారం కనిగిరి వైసీపీ కార్యాలయంలో వైసీపీ ప్రజా ఉద్యమం కార్యక్రమ పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ప్రభుత్వం తక్షణం ఆపాలన్నారు.