RR: శంషాబాద్ విమానాశ్రయంలో భద్రతా విధులు నిర్వహిస్తున్న సీఐఎస్ఎఫ్ జవాన్ అమర్ నాథ్ (39) బ్రెయిన్ స్ట్రోక్తో మృతిచెందారు. అనంతపురం జిల్లా అప్పేచెర్ల గ్రామానికి చెందిన ఆయన, పుట్టినరోజే మరణించడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. ఈ నెల 20న విధుల్లో ఉండగా అస్వస్థతకు గురైన అమర్ నాథ్, నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు కన్నుమూశారు.