MNCL: మందమర్రి పట్టణంలో న్యాయస్థానం ఏర్పాటు చేయడం వల్ల కక్షిదారులకు, సాక్షులకు చాలా వరకు ఇబ్బందులు తొలగిపోతాయని CI శశిధర్ రెడ్డి ప్రకటనలో తెలిపారు. వారికి సమయంతో పాటు ఆర్థికంగా ఆదా అవుతుందన్నారు. త్వరితగతిన కేసుల పరిష్కారానికి ఆస్కారం ఉండటంతో సత్వర న్యాయం జరుగుతుందని అన్నారు. కోర్ట్ ఏర్పాటుతో కొందరు చిరు వ్యాపారులకు ఉపాధి దొరుకుతుందని పేర్కొన్నారు.