NRML: జిల్లా కేంద్రంలోని బంగల్పేట శివారులోని పంట చేనులో మేతకు వెళ్లిన గేదె విద్యుత్ ట్రాన్సఫార్మర్ కు తగిలి మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ఆదుముల్ల నారాయణకు చెందిన గేదె యథావిధిగా మేతకు వెళ్లగా, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్కు కంచె లేకపోవడంతో అది తగిలి మృతి చెందిందని రైతు వాపోయారు.