కర్నూలు ప్రమాద సమయంలో బస్సులో 13 మంది తెలంగాణవాసులు ఉన్నట్లు తెలుస్తోంది. అందులో ఏడుగురు కర్నూలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ ఏడుగురిలో నలుగురు హైదరాబాద్, ఖమ్మం, రంగారెడ్డి, సంగారెడ్డికి చెందినవారిగా అధికారులు గుర్తించారు. మిగిలిన వారి ఆచూకీ తెలియాల్సి ఉందన్నారు. హెల్ప్ లైన్ నంబర్స్: 9912919545, 9440854433.