VZM: ఆండ్ర జలాశయంలోకి గురువారం సాయంత్రం ఇన్ ఫ్లో 750క్యూసెక్కుల వరద నీరు రావడంతో స్పిల్వే రెండో గేట్ ద్వారా 400 క్యూసెక్కుల నీటిని చంపావతి నదిలోకి విడుదల చేశామని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. చంపావతి నది పరివాహక ప్రాంతాలైన అనంతగిరి, మెంటాడ మండలంలో కురుస్తున్న వర్షాల కారణంగా జలాశయంలో నీటి మట్టం పెరిగిందన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.