KMR: వైన్స్ షాపుల లైసెన్స్‌ల కోసం దరఖాస్తు చేసుకునే గడువు ముగిసింది. కామారెడ్డి జిల్లాలోని 49 షాపుల వైన్స్ షాపులకు గాను 1502 దరఖాస్తులు అందినట్లు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ హనుమంత్ రావు గురువారం సాయంత్రం ఓ ప్రకటనలో తెలిపారు. అయితే, గత ఏడాది వచ్చిన దరఖాస్తులతో పోలిస్తే ఈసారి సంఖ్య తగ్గింది. గతేడాది 2204 దరఖాస్తులు వచ్చాయన్నారు.