AP: కర్నూలు జిల్లా వద్ద బస్సులో జరిగిన అగ్ని ప్రమాదంపై SP స్పందించారు. ప్రమాదస్థలానికి FSL టీమ్ చేరుకుందని తెలిపారు. బెంగళూరు వెళ్తున్న బస్సు టూవీలర్ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించారు. పొగను గమనించిన స్థానికులు బస్సు అద్దాలు పగలగొట్టారని పేర్కొన్నారు. మంటలతో బస్సులో ఉన్న వారికి తీవ్రంగా గాయపడ్డారన్నారు. ఎంత మంది మృతి చెందారో ఇప్పుడే చెప్పలేమని తెలిపారు.