GNTR: తెనాలిలోని మారీసుపేట, ఎరువుల కొట్ల బజారులో దీపావళి రోజున టపాసుల కారణంగా విద్యుత్ స్తంభంపై అగ్ని ప్రమాదం జరిగింది. స్థానికులు, ఫైర్ సిబ్బంది అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. అయితే మరమ్మతుల కోసం వచ్చిన కేబుల్, ఇంటర్నెట్ కంపెనీల సిబ్బంది తెగిన వైర్లను రోడ్డుపైనే వదిలి వెళ్లిపోయారు. సంబంధిత అధికారులు స్పందించి వాటిని తొలగించాలని స్థానికులు కోరారు.