TG: ఇటీవల తమ కూమార్తె సుష్మిత చేసిన ఘాటు వ్యాఖ్యలకుగాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మంత్రి కొండా సురేఖ క్షమాపణలు కోరారు. ఇప్పుడు తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవని, అన్నీ సమసిపోయాయని తెలిపారు. పోలీసులు ఇంటికి రావడంతోనే తమ కూతురు ఆవేశంతో మాట్లాడిందని పేర్కొన్నారు.